- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chennai Super Kings : చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పెను విషాదం
చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి మంగళవారం కన్నుమూశారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముఖేష్ చౌదరి తల్లి నిన్న అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధితో ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి బాధపడుతున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమించిన నేపథ్యంలో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు చెబుతున్నారు.
దీంతో హుటా హుటిన ముంబై నుంచి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు ముఖేష్. ఈ క్రమంలో ఇవాళ ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, క్లాసెన్ లాంటి డేంజర్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టాడు ముఖేష్. అలాంటి ఆటగాడు ఇవాళ జరిగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కలవరపెడుతోంది. ఇది ఇలా ఉండగా గాయంతో ఆయుష్ మాత్రే ఇప్పటికే దూరం కాగా.. అతని స్థానంలో ఉర్విల్ పటేల్ తుది జట్టులో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.






