మళ్లీ థియేటర్లలోకి వస్తున్న 'రఘువరన్ బీటెక్'.. రిలీజ్ డేట్ ఫిక్స్

by Pulgam srinivas |

రఘువరన్ బీటెక్ చిత్రాన్ని జూలై 4న రీ-రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న రఘువరన్ బీటెక్.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం 'రఘువరన్ బీటెక్'. ఇది తమిళంలో భారీ విజయాన్ని సాధించిన 'వేలాయిల్లా పట్టాదారి (VIP)' చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండానే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలి కాలంలో పలు డబ్బింగ్ చిత్రాలు రీ-రిలీజ్ అయ్యి మంచి ఆదరణతో పాటు ఆకట్టుకునే కలెక్షన్లను కూడా సాధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 'రఘువరన్ బీటెక్' సినిమాను కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, ఈ చిత్రాన్ని జూలై 4న రీ-రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్. వేల్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సముద్రఖని, శరణ్య పొన్వన్నన్, వివేక్, సురభి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు.

Next Story