- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026 : టికెట్లు డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు.. బెంగళూరు నుంచి ఫైనల్‌ను తరలించే యోచనలో బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను ఇంకా ప్రకటింలేదు. త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ చెబుతోంది. అయితే, డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ నిర్వహించాలి. కానీ, బెంగళూరు నుంచి టైటిల్ పోరును తరలించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలకు టికెట్ల డిమాండ్ వివాదాస్పదం కావడంతో బెంగళూరులో ఫైనల్ జరగడం సందేహాలు నెలకొన్నాయి. ‘ ఐపీఎల్-2026 ఫ్లే ఆఫ్స్ మ్యాచ్‌లు పంజాబ్, కర్ణాటకలో జరిగే అవకాశం ఉంది. గత సీజన్ విన్నర్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాలి. కానీ, బెంగళూరులో ఎమ్మెల్యే టికెట్ సమస్య ఇబ్బందులను సృష్టిస్తోంది. దానికి పరిష్కారం చూపకపోతే బీసీసీఐ ఫైనల్‌ను మరో సిటీకి తరలించొచ్చు.’అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ ప్రజాప్రతినిధులకు ఉచితంగా టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒక్క ఎమ్మెల్యేకు ఐదు టికెట్లు ఇవ్వడంతోపాటు ప్రత్యేకమైన సీటింగ్ ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు ఎమ్మెల్యే, ఎంఎల్‌సీ, ఎంపీలకు మూడు టికెట్ల చొప్పున ఇస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చే టికెట్లు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రజలు, అభిమానులు కూడా ఉచిత టికెట్ల కోసం డిమాండ్ చేయడాన్ని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ‘వీఐపీ కల్చర్’పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఫైనల్ నిర్వహించడంపై బీసీసీఐ ఆలోచనలో పడింది. గతేడాది ఆర్సీబీ విజయాత్సవాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే.






