- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rohith Sharma : ముంబైకి షాక్.. రోహిత్ డకౌట్
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న కీలకపోరులో ముంబైకి భారీ షాక్ తలిగిలింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య వాంఖడే స్టేడియంలో నేడు జరుగుతున్న కీలకపోరులో ముంబైకి భారీ షాక్ తలిగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ పరుగులేవి చేయకుండానే డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లో నాలుగో బంతికి వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అంతకముందు సెషన్లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 27, జురెల్ 38, శనక 29 పరుగులతో రాణించారు. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి మొదటి ఓవర్ లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. రోహిత్ డకౌట్ కాగా.. మొదటి ఓవర్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేయడం గమనార్హం. ఆర్చర్ వేసిన మూడో ఓవర్‌లో నమన్ క్లీన్‌బౌల్డ్ కావడం ముంబైని మరింత కష్టాల్లోకి నెట్టింది.
Next Story






