మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు...ఏకంగా రూ.2 లక్షల వ‌ర‌కు!

by velandi.Saikiran |

మారుతి సుజుకి ( Maruti Suzuki) కంపెనీకి సంబంధించిన పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు.

మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు...ఏకంగా రూ.2 లక్షల వ‌ర‌కు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. మారుతి సుజుకి ( Maruti Suzuki) కంపెనీకి సంబంధించిన పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఒక్కో కారుపై రూ.15,000 నుంచి మొదలుకొని రెండు లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. బాలెనో కారుపైన క్యాష్ బెనిఫిట్ కింద దాదాపు రూ. 15 వేలు డిస్కౌంట్ రానుంది. అదే సమయంలో ఎక్స్చేంజ్ పైన అదనంగా మరో రూ. 15 వేల వరకు బోనస్ ఇవ్వనున్నారు.

ఏప్రిల్ చివ‌రి వ‌ర‌కు మారుతి కార్ల‌పై భారీ డిస్కౌంట్లు

ఫ్రాంక్స్ కారుపైన నగదు బెనిఫిట్ కింద దాదాపు రూ. 40 వేలు డిస్కౌంటు వస్తోంది. అలాగే ఎక్స్చేంజ్ కింద పది వేల వరకు బోనస్ అంద‌నుంది. XL6 పై రూ. 40 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. విటారా కారు పైన రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇన్విక్టో కారు పైన రెండు లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించారు. అయితే ఈ డిస్కౌంట్ లో ఏప్రిల్ నెలలో మాత్రమే ఉంటాయి. మే తర్వాత ఆఫర్లు తొలగిస్తారు.

Next Story