- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాండ్యాను తొలగించి, రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వండి - మనోజ్ తివారీ
పాండ్యాను తొలగించి, రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వండి అంటూ మనోజ్ తివారీ కోరారు.

దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ వరుసగా ఓటమి పాలు అవుతున్న నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ ( Manoj Tiwary ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తొలగించి వెంటనే రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాలని సూచనలు చేశారు. అప్పుడే ముంబై ఇండియన్స్ విజయాల బాట పడుతుందని స్పష్టం చేశారు మనోజ్ తివారీ. హార్దిక్ పాండ్యా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని.. దాని వల్ల ముంబై ఇండియన్స్ నష్టపోతుందని ఫైర్ అయ్యారు.
రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాల్సిందే
భారత జట్టులో సీనియర్ క్రికెటర్లుగా ఉన్న బుమ్రా, సూర్య లాంటి వాళ్ల పైన కూడా హార్దిక్ పాండ్యా సీరియస్ అవుతున్నట్లు వెల్లడించారు. సీనియర్లు, జూనియర్లను కలుపుకుని వెళ్లడంలో పాండ్యా విఫలమవుతున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సార్లు ముంబైని ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలన్నారు. లేకపోతే ముంబైని కాపాడడం కష్టమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు మనోజ్ తివారీ. కాగా ఇప్పటి వరకు ముంబై 5 మ్యాచ్ లు ఆడితే, అందులో నాలుగింటిలో ఓడిపోయింది.






