ఆర్సీబీకి బిగ్ షాక్‌...ఉత్కంఠ పోరులో ల‌క్నో విజ‌యం

by velandi.Saikiran |

ఆర్సీబీకి బిగ్ షాక్‌...ఉత్కంఠ పోరులో ల‌క్నో విజ‌యం సాధించింది.

ఆర్సీబీకి బిగ్ షాక్‌...ఉత్కంఠ పోరులో ల‌క్నో విజ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్: RCB జట్టుకు షాక్ తగిలింది. సొంత గడ్డపై బెంగళూరుతో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. వరుసగా ఆరు ఓటములు మూటగట్టుకున్న తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన బెంగళూరు మ్యాచ్ లో... ఏకంగా 213 పరుగుల టార్గెట్ విధించి, డిఫెండ్ చేసుకుంది లక్నో. ఓపెనర్లు బెథెల్, విరాట్ కోహ్లీ త్వరగా ఔట్ అయిన నేపథ్యంలో బెంగళూరు ఒత్తిడికి లోనైంది. అయినప్పటికీ కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరి వరకు నిల్వ లేకపోయారు. ఈ క్రమంలో 9 పరుగుల తేడాతో బెంగుళూరుపై లక్నో విక్టరీ అందుకుంది. బెంగళూరుపైన విజయాన్ని నమోదు చేసుకున్న లక్నో, ప్లే ఆఫ్స్ ఛాన్స్ లను నిలుపుకుంది.

Next Story