- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్నో సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు !
చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: చెన్నై తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై విధించిన 188 పరుగుల టార్గెట్ ను అవలీలగా ఛేదించింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చిన తరుణంలో, 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది లక్నో. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.
చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు !
ఈ మ్యాచ్ లో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఊచకోత కోశాడు. 7 సిక్సర్లు, 9 ఫోర్లతో 38 బంతుల్లోనే 90 పరుగులు సాధించాడు. జస్ట్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ ఇంగ్లిస్ 36 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, లక్నో ను బయట పడేసారు. ఇక లక్నో చేతుల్లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది.






