నేడు LSGతో మ్యాచ్..చెన్నైకి ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు ఉన్నాయా?

by velandi.Saikiran |

నేడు LSGతో చెన్నై మ్యాచ్ ఉంది. ఇందులో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు మ‌రింత చెన్నై ద‌గ్గ‌రకానుంది.

నేడు LSGతో మ్యాచ్..చెన్నైకి ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు ఉన్నాయా?
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఇవాళ లక్నో, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏక‌నా స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో మహేందర్ సింగ్ ధోని తుది జట్టులో ఉంటాడని చర్చ జరుగుతోంది. అటు ఈ మ్యాచ్ కంటే ముందే చెన్నైకి ఊహించని షాక్ తగిలింది. టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తున్న ఓవర్టన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడు మళ్ళీ జట్టులోకి వచ్చేది కష్టమేనని అంటున్నారు. ఓవ‌ర్ట‌న్ జట్టులో లేకపోవడం చెన్నైకి ఎదురు దెబ్బే.

చెన్నై సూపర్ కింగ్స్ కు బంపర్ ఆఫర్

ముంబై చేతిలో నిన్న పంజాబ్ కింగ్స్ ఓడిపోయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు బంపర్ ఆఫర్ తగిలింది. ఇవాళ లక్నోపైన విక్టరీ కొడితే, నాలుగో స్థానానికి ఎగబాకే ఛాన్స్‌ చెన్నైకి ఉండ‌నుంది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లతో చెన్నై తలపడునుంది. ఈ రెండిటిపై ఏదో ఒక మ్యాచ్ గెలిచినా, చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయిన లక్నో, మిగతా మ్యాచ్ ల‌లో గెలిచి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని భావిస్తుంది.

Next Story