- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: టాస్ గెలిచిన లక్నో.. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 32వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 32వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడీ రాజస్థాన్‌కు భారీ స్కోరు అందించాలని చూస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ వైపే మొగ్గు చూపిన లక్నో, రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావిస్తోంది. మహమ్మద్ షమీ, మాయాంక్ యాదవ్ వంటి బౌలర్లపై లక్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 4 విజయాలతో పట్టికలో 4వ స్థానంలో ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే లక్నోకు ఈ విజయం అత్యంత కీలకం. మరో పక్క, స్పిన్నర్లకు అనుకూలించే ఏకానా పిచ్‌పై రాజస్థాన్ స్పిన్నర్లు ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read More..






