హార్దిక్ పాండ్యా ఓ ప్లాస్టిక్ కెప్టెన్‌ !

by velandi.Saikiran |

హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ ఉందని తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు.

హార్దిక్ పాండ్యా ఓ ప్లాస్టిక్ కెప్టెన్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ పైన తప్ప మిగిలిన ఏడు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే అంటున్నారు. అయితే ముంబై ఇండియన్స్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వెనక హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ ఉందని తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు.

హార్దిక్ పాండ్యా ఓ ప్లాస్టిక్ కెప్టెన్ అని మండిపడ్డారు. అతడి చెత్త నిర్ణయాల కారణంగా ముంబై ఇండియన్స్ ఈ పరిస్థితిలో ఉందని విమర్శలు చేశారు. కెప్టెన్సీ ఉన్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలోకి పాండ్యా వెళ్తున్నాడని పేర్కొన్నారు. అయితే కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, హార్దిక్ పాండ్యా చాలా ఫ్రీగా, భయంకరంగా ఆడతాడని సూచనలు చేశారు. అతనికి కెప్టెన్సీ పనికిరాదని కూడా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ దీనిపై ఆలోచన చేయాలని కోరారు. అటు రోహిత్ శర్మను వెంటనే జట్టులోకి తీసుకురావాలని పేర్కొన్నారు కృష్ణమాచారి శ్రీకాంత్.

Next Story