రింకు సింగ్ ఫినిషర్ కాదు..ప‌రువు తీసిన మాజీ క్రికెట‌ర్‌

by velandi.Saikiran |

రింకు సింగ్ ఫినిషర్ కాదంటూ మాజీ క్రికెట‌ర్ ప‌రువు తీశారు కృష్ణమాచారి శ్రీకాంత్.

రింకు సింగ్ ఫినిషర్ కాదు..ప‌రువు తీసిన మాజీ క్రికెట‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026లో కేకేఆర్ వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్ లలో చిత్తుగా ఓడింది కేకేఆర్. ఈ నేపథ్యంలో కేకేఆర్ వైఫల్యాలపై కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఆట కొనసాగితే మొదట ఎలిమినేట్ అయ్యేది కేకేఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫినిషర్ గా రింకు పనికిరాడు

కేకేఆర్ లో రింకు సింగ్ ఫినిషర్ గా పనికిరాని బాంబు పేల్చారు కృష్ణమాచారి శ్రీకాంత్. గతంలో ఐదు సిక్సులు కొట్టాడని ఇప్పటికీ ఛాన్సులు ఇస్తున్నారు.. కానీ రింకు మాత్రం విఫలమవుతూనే ఉన్నాడని మండిపడ్డారు. ఐదో స్థానానికి రింకు సింగ్ అస్సలు పనికిరాడ‌ని.. అతన్ని ఫినిషర్ అని పిలవకూడదని రిక్వెస్ట్ చేశారు. ఛేజింగ్ సమయంలో రన్ రేట్ 12 దాటితే, రింకు సింగ్ కాళ్లు వణికి పోతాయని హాట్ కామెంట్స్ చేశారు. చివరలో ఐదు ఓవర్లలో 50 పరుగులు కొట్టాల్సి వస్తే మాత్రమే రింకు సింగ్ పనికి వస్తాడు తప్ప, ఫినిషర్ రోల్ కు ఏ మాత్రం షూట్ కాడని చుర‌క‌లు అంటించారు. గ్రీన్, ర‌హానే ప‌ట‌తీరుకు కూడా కేకేఆర్ ను ఇబ్బందుల్లో ప‌డేస్తోంద‌న్నారు.

Next Story