ఫిన్ అలెన్ సెన్సేషన్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను చితక్కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్

by Gantepaka Srikanth |

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

ఫిన్ అలెన్ సెన్సేషన్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను చితక్కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలెన్, ఎదురులేని బ్యాటింగ్‌తో సెంచరీ పూర్తి చేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రీన్ సైతం మెరుపు బౌండరీలతో అతనికి చక్కని సహకారం అందించి జట్టుకు విజయాన్ని అందించారు. మరోవైపు.. సొంత గడ్డపై కనీసం పోరాట పటిమ కనబరుస్తుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. ఫిన్ అలెన్ ధాటికి ఏ బౌలర్ కూడా కనీస ప్రభావం చూపలేకపోయారు. కట్టుదిట్టమైన బంతులు వేయడంలో విఫలమై భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తానికి 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగించిన కేకేఆర్, నెట్ రన్ రేట్‌ను భారీగా పెంచుకుంది.

Next Story