టాస్ గెలిచిన KKR..హార్ధిక్ పాండ్యాకు బిగ్ రిలీఫ్‌

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026లో కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

టాస్ గెలిచిన KKR..హార్ధిక్ పాండ్యాకు బిగ్ రిలీఫ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల సమయంలో వర్షం పడగా, మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందని అందరు అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి క్రితమే వర్షం తగ్గుముఖం పట్టగా, టాస్ వేశారు. అయితే ఇందులో టాస్ నెగ్గిన కేకేఆర్, ఫస్ట్ బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

అయితే మొన్నటి వరకు జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, ఇవాళ్టి మ్యాచ్ లో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అతని కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ ఇవాళ మ్యాచ్ ఆడనుంది. అటు ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ నేడు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అటు ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయింది. పరువు కోసం ఈ మ్యాచ్ లో గెలిచేందుకు సిద్ధమైంది.

Next Story