- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కోల్‌కతా
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈరోజు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈరోజు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో సాధారణంగానే ఛేజింగ్ చేసే జట్టుకు సానుకూల ఫలితాలు వస్తుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రహానే ఫీల్డింగ్ తీసుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. హోమ్ గ్రౌండ్ కావడంతో కోల్‌కతా జట్టుకు అభిమానుల మద్దతు పుష్కలంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్‌తో భారీ స్కోరు సాధించాలని చూస్తుండగా, కోల్‌కతా బౌలర్లు వారిని తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ 11): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ 11): అజింక్యా రహానె(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ.






