- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: వాంఖడేలో కేకేఆర్ బ్యాటర్ల వీరవిహారం.. ముంబై ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్-2026 సీజన్ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026 సీజన్ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు, ముంబై ఇండియన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని భారీ స్కోరును సాధించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ముంబై జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి టఫ్ బౌలర్లను సైతం లెక్కచేయకుండా కోల్‌కతా బ్యాటర్లు వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలదొక్కుకుని ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మొత్తంగా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా జట్టు 220 పరుగులు చేసింది. అజింక్య రహానే (67), ఫిన్ అలెన్ (37), రఘువంశీ (51), రింకూ సింగ్ (33), గ్రీన్ (18) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, హార్దిక్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించాలంటే 221 పరుగులు చేయాల్సి ఉంది.
ముంబై ఛేజింగ్ ఎలా ఉండబోతుంది?
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో, ఇంతటి భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఎలా ఛేదిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, రికెల్టన్, తిలక్, హార్దిక్ వంటి స్టార్ బ్యాటర్లతో కూడిన ముంబై పల్టన్.. కోల్‌కతా నిర్దేశించిన ఈ 'మౌంటైన్' స్కోరును అధిగమిస్తుందో లేదో చూడాలి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో ఇన్నింగ్స్‌లో అసలైన పోరు మొదలుకానుంది.






