- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: ఆర్సీబీ నెట్స్‌లో కోహ్లీ ‘నాగిని’ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తనదైన శైలిలో సందడి చేశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్-2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తనదైన శైలిలో సందడి చేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కోహ్లీ చేసిన ‘నాగిని డ్యాన్స్’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టైటిల్ డిఫెండింగ్ ఒత్తిడిలో ఉన్న తోటి ఆటగాళ్లను ఉత్సాహ పరిచేందుకు కోహ్లీ ఈ ఫన్నీ డ్యాన్స్ చేశాడు. కోహ్లీ డ్యాన్స్‌కు మైదానంలో ఉన్న కోచింగ్ స్టాఫ్, అభిమానులు కడుపుబ్బా నవ్వారు.
తొలి ఓటమి చవిచూసిన ఆర్సీబీ..
ఇదిలా ఉండగా, గౌహతి వేదికగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో టోర్నీలో తొలి ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (63) రాణించడంతో 20 ఓవర్లలో 201/8 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌కు చెందిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78) విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) కూడా చెలరేగడంతో రాజస్తాన్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
వైభవ్‌కు కోహ్లీ ప్రశంసలు
మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన విరాట్ కోహ్లీ.. ఆ కుర్రాడి రాజస్తాన్ రాయల్స్ క్యాప్‌పై ‘డియర్ వైభవ్.. వెల్ డన్’ అని రాసి సంతకం చేసి బహుమతిగా ఇచ్చాడు. రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్ ప్రదర్శనను కొనియాడాడు. అందరితో సరదాగా ఉండే వైభవ్ ఆటను ఎంతో ఆస్వాదిస్తాడని, ఆ చిన్నోడికి కావాల్సినవన్నీ తాము సమకూరుస్తున్నామని పరాగ్ తెలిపాడు.






