- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెన్రిచ్ క్లాసెన్ సరికొత్త చరిత్ర..బద్దలైన పంత్ రికార్డ్
ఐపీఎల్ చరిత్రలో హెన్రిచ్ క్లాసెన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో RCBపై బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా 55 పరుగుల తేడాతో బెంగుళూరును చిత్తు చేసింది. కానీ రన్ రేట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ మొదటి రెండు స్థానంలో నిలిచాయి. అటు బెంగళూరుపైన గెలిచిన హైదరాబాద్ మాత్రం మూడో స్థానంలో ఉండిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణించాడు. 24 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డు సృష్టించాడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్.
రిషబ్ పంత్ రికార్డ్ బద్దలు
మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఒకే సీజన్ లో 606 పరుగులు సాధించాడు. కేవలం 14 మ్యాచ్ ల్లో 50.50 యావరేజ్ తో ఈ స్కోర్ సాధించాడు. ఈ క్రమంలోనే ఒకే సీజన్ లో 600 పరుగులు సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు రిషబ్ పంత్ పేరుపైన ఉంది. అతను 2018 సీజన్ సందర్భంగా 579 పరుగులు సాధించాడు. అయితే ఆ రికార్డును క్లాసెన్ తాజాగా బద్దలు కొట్టి, మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరి తర్వాత రియాన్ పరాగ్ 2024లో 573 పరుగులు సాధించాడు. 2013లో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రోహిత్ శర్మ 538 రన్స్ కొట్టగలిగాడు. 2021 లో మ్యాక్స్ వెల్ 513 పరుగులు సాధించి 5వ స్థానంలో నిలిచాడు.






