IPL : మ్యాచ్ టై.. KKR విజయం

by Muthe.Rajitha |   (  Updated:2026-04-26 18:32:11  IST  )

IPL 2026 సీజన్లో KKR ఎట్టకేలకు మరో విజయం సాధించింది.

IPL : మ్యాచ్ టై.. KKR విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో KKR ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. నేడు KKR vs LSG మ్యాచ్ టై కాగా.. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్లో కోల్కతా గెలుపొందింది. ఈ సీజన్లోనే ఇది తొలి సూపర్ ఓవర్ కాగా.. KKR కు కూడా ఈ సీజన్లో ఇది రెండో విజయం. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. చివరికి వరకూ ఉత్కంఠతతో పోరాడిన చివరికి మ్యాచ్ టై అవక తప్పలేదు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగుకు దిగిన లక్నో 2 వికెట్లు కోల్పోయి ఒక పరుగు మాత్రమే చేయగా... కోల్కతా రెండవ బాల్ కే బౌండరీ బాది గెలుపును తన ఖాతాలో వేసుకుంది. రింకూ సింగ్ ఫోర్ బాదడంతో.. KKR జట్టుతోపాటు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

Next Story