- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సండే స్టార్... రింకూ సింగ్
IPL లో భాగంగా ఆదివారం జరిగిన KKR vs LSG మ్యాచులో కోల్కతా స్టార్ రింకూ సింగ్ వన్ మ్యాన్ షో చేసి అదరగొట్టాడు.

దిశ, వెబ్ డెస్క్ : IPL లో భాగంగా ఆదివారం జరిగిన KKR vs LSG మ్యాచులో కోల్కతా స్టార్ రింకూ సింగ్ వన్ మ్యాన్ షో చేసి అదరగొట్టాడు. కాగా తొలుత బ్యాటింగుకు దిగిన కోల్కతా 155 పరుగులలో 83 రన్స్ రింకూ చేసినవే. తన కెరీర్ బెస్ట్ 83 రన్స్ స్కోర్ చేయడమే కాదు.. లాస్ట్ ఓవర్లో నాలుగు సిక్సులు బాది జట్టు స్కోరును 155 కు చేర్చిన ఘనత రింకూదే. ఇక కోల్కతా ఫీల్డింగులో కీలక సమయంలో నాలుగు క్యాచులు పట్టాడు. అందులో ఒక లక్నో బ్యాటర్ మార్ర్కం కొట్టిన బాల్ ను బౌండరీ వద్ద ఒడిసి పట్టి, స్పీడ్ లో కంట్రోల్ తప్పి బౌండరీ లైన్ దాటుతుండగా బంతిని లోపలి విసిరి మళ్ళీ వచ్చి క్యాచ్ పట్టడం చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక మ్యాచ్ చివర్లో సూపర్ ఓవర్ కు దారి తీయగా.. లక్నో మొదట బ్యాటింగుకు దిగగా, రింకూ ఫాలో ఆన్ క్యాచ్ పట్టాడు. అనంతరం KKR బ్యాటింగులో బరిలోకి దిగి విన్నింగ్ ఫోర్ కొట్టి కోల్కతాను గెలిపించి హీరో అయ్యాడు. అలా ఆదివారం మ్యాచులో ఒంటిచేత్తో తన జట్టు విక్టరీ సాధించడానికి కీలక పాత్ర పోషించి, సుండే స్టార్ గా మారిపోయాడు రింకూ సింగ్.






