IPL 2026: ముగిసిన కేకేఆర్ ఇన్సింగ్స్.. లక్నో లక్ష్యం ఎంతంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-09 15:51:02  IST  )

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది.

IPL 2026: ముగిసిన కేకేఆర్ ఇన్సింగ్స్.. లక్నో లక్ష్యం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. హోమ్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. కోల్‌కతా బ్యాటర్లు సమిష్టిగా రాణించి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించాలంటే 182 పరుగులు చేయాల్సి ఉంది. కోల్‌కతా బ్యాటర్లలో రహానే (41), రఘువంశీ (45), గ్రీన్ (32), రోమన్ (39) పరుగులు చేశారు. లక్నో బౌటర్లలో ప్రిన్స్, సిద్ధార్థ్, దిగ్వేష్, ఆవేశ్ తలో వికెట్ తీశారు.

Next Story