వరుసగా మూడు విజయాలు... మళ్లీ రేసులోకి వచ్చిన KKR

by velandi.Saikiran |

వరుసగా మూడు విజయాల నేప‌థ్యంలో మళ్లీ KKR రేసులోకి వచ్చింది.

వరుసగా మూడు విజయాలు... మళ్లీ రేసులోకి వచ్చిన KKR
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో కేకేఆర్ నెమ్మదిగా పుంజుకుంటోంది. మొదట్లో వరుసగా పరాజయాలను చవి చూసిన కేకేఆర్, ఇప్పుడు మూడు మ్యాచ్ ల‌లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు కేకేఆర్ 9 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్ రద్దు కాగా, మిగిలిన ఐదింటిలో ఓడిపోయింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ పైన నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన కేకేఆర్, లక్నోపై సూపర్ ఓవర్ ద్వారా విక్టరీ అందుకుంది.

అదే ఊపు ఆదివారం హైదరాబాద్ పైన చూపించి, ముచ్చటగా మూడో విజయం నమోదు చేసింది. అంటే మొత్తంగా ఏడు పాయింట్లు సాధించింది కేకేఆర్. మిగతా ఐదు మ్యాచ్ లలో కేకేఆర్ విజయం సాధిస్తే.. 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. ఇదే ఊపుతో కేకేఆర్ ముందుకు వెళ్తే... కచ్చితంగా టైటిల్ కూడా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. టీ 20 ఫార్మాట్ లో ఎవ‌రినీ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story