Kavya Maran car's collection : కావ్య మారన్ కార్ల క‌లెక్ష‌న్ ఇదే..!

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 13:47:04  IST  )

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్‌ కావ్యా మారన్ కార్ల క‌లెక్ష‌న్ వైర‌ల్ గా మారింది.

Kavya Maran cars collection : కావ్య మారన్ కార్ల క‌లెక్ష‌న్ ఇదే..!
X

దిశ‌, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా దూసుకు వెళ్తున్నారు కావ్య. సన్ రైజర్స్ హైదరాబాద్ ను కొనుగోలు చేసి.. సక్సెస్ ఫుల్ గా జట్టును ముందుకు సాగిస్తున్నారు. అయితే అలాంటి కావ్య మారన్ కార్ల కలెక్షన్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

కావ్య మారన్ కార్ల కలెక్షన్

SRH టీమ్ ఓనర్ కావ్య మారన్ కు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో భారీ ధరలు ఉన్న కార్లు దర్శనం ఇస్తాయి. వీటిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls-Royce Phantom) ఉండగా.. దీని ధర రూ. 12.2 కోట్లు కావడం గమనార్హం. అలాగే బెంట్లే బెంటయ్గా (Bentley Bentayga) రూ. 6 కోట్లు, ఫెరారీ రోమా రూ. 4.5 కోట్లుగా ఉంది. బీఎండబ్ల్యూ i7 EV రూ. 2.5 కోట్ల కారు కూడా ఇటీవల కావ్య కొనుగోలు చేశారు. అయితే ఇందులో ఎక్కువగా ఫెరారీ కారును కావ్య వాడుతారని చెబుతున్నారు. అటు సన్ టీవీ నెట్ వ‌ర్క్‌ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న కావ్య నెట్ వర్క్ సుమారు రూ.450 కోట్లుగా ఉంటుంది.

SRHకు కొత్త టెన్ష‌న్.. ఇషాన్ పై వేటు ప‌డే ఛాన్స్ !

Next Story