- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRHకు కొత్త టెన్షన్.. ఇషాన్ పై వేటు పడే ఛాన్స్ !
ఇషాన్ కిషన్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో SRH వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో అదరగొడుతోంది హైదరాబాద్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా మూడో స్థానంలో ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న కమిన్స్, తిరిగి జట్టులో చేరబోతున్నాడు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా కమిన్స్ రీ-ఎంట్రీ ఇస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఇషాన్ కిషన్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇషాన్ కిషన్ నే కెప్టెన్ గా కొనసాగించండి
కావ్య మారన్ కూడా కమిన్స్ కే సారాధ్య బాధ్యతలు ఇస్తుందని కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో SRH అద్భుతంగా రాణిస్తోందని వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు చేస్తే, జట్టు లయ కోల్పోతుందని యాజమాన్యానికి సూచనలు చేశారు. ఇషాన్ కిషన్ ను కెప్టెన్ గా కొనసాగిస్తూనే, కమిన్స్ ను తుది జట్టులోకి తీసుకోవాలని కోరారు. కమిన్స్ కు కెప్టెన్సీ ఇస్తే, హైదరాబాద్ మళ్లీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. మరి దీనిపై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.






