- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ఇండియన్ లేడీతో హోటల్ లో దొరికిపోయిన విదేశీ క్రికెటర్ !
ఢిల్లీలోని హోటల్‌లో ఓ ఇండియన్ లేడీతో జాసన్ హోల్డర్ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగుతున్న తరుణంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ జాసన్ హోల్డర్ ( Jason Holder) మాత్రం చిల్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ అమ్మాయిలతో తిరుగుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఈ మేరకు ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. దీంతో ఢిల్లీకి వచ్చిన గుజరాత్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్, ఓ లేడితో కనిపించాడు. అయితే ఆ లేడీ ఇండియాకు సంబంధించిన వ్యక్తి కావడం ఇక్కడ హాట్ టాపిక్ అయింది.
హోటల్ లో కలుసుకున్న జాసన్ హోల్డర్ జంట
జాసన్ హోల్డర్, ఆ ఇండియన్ లేడీ ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ లో కలుసుకున్నట్లు వీడియో బయటకు కూడా వచ్చింది. అయితే ఈ ఇద్దరిని కెమెరాలో ఓ వ్యక్తి క్యాప్చర్ చేస్తున్న నేపథ్యంలో, వీడియో తీయకు అంటూ జాసన్ హోల్డర్ హెచ్చరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ఇండియన్ లేడీతో జాసన్ హోల్డర్ డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వైరల్ చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతోన్న జాసన్
ఢిల్లీలో ఓ లేడీతో దొరికిన జాసన్ హోల్డర్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా హోల్డర్ కు తుది జట్టులో అవకాశం రాలేదు. దీంతో రిజర్వ్ బెంచ్ కు పరిమితం అయ్యాడు. కాగా మొన్నటి వేలం సందర్భంగా ఏడు కోట్ల రూపాయలకు జాసన్ హోల్డర్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడు హోల్డర్. ముఖ్యంగా ఫినిషర్ రోల్ చేసే సామర్థ్యం జాసన్ హోల్డర్ కు ఉంది.






