ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్‌.. మ్యాచ్‌ల సంఖ్య పెంచడంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

పీఎల్ మ్యాచ్ ల‌ను పెంచాలన్న డిమాండ్లపై ఛైర్మన్ అరుణ్ ధూమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్‌.. మ్యాచ్‌ల సంఖ్య పెంచడంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ లవర్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ మ్యాచ్ ల సంఖ్య పెంచడం కష్టమేనని తెలుస్తోంది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ ల‌ను పెంచాలన్న డిమాండ్లపై ఛైర్మన్ అరుణ్ ధూమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ల సంఖ్య పెంచడం కష్టమేనని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ లో 74 మ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అరుణ్ ధూమల్. ఛాన్స్ ఉంటే 94 మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. కానీ అది వర్కౌట్ అవ్వడం లేదని వివరించారు.

ఐపీఎల్ మ్యాచ్ లు పెంచ‌లేం

అయితే ఐపీఎల్ మ్యాచ్ ల‌ సంఖ్య పెంచడం అనేది అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ పైన ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత విండోలోనే మ్యాచ్ లు పెంచాలంటే చాలా కష్టమన్నారు. ఒకవేళ పెంచాలనుకుంటే డబుల్ హెడర్స్ మ్యాచ్ లో ఎక్కువగా నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంటుందని స్పష్టం చేశారు. ఇది బ్రాడ్ కాస్టర్లకు పెద్దగా నచ్చ బోదని తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్ లకు డిమాండ్ తగ్గుతోన్న‌ నేపథ్యంలో వాటి సంఖ్య తగ్గిస్తే, ఐపీఎల్ మ్యాచ్ లు పెంచుకోవచ్చని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్ ల సంఖ్య పెంచేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు అరుణ్ ధుమాల్.

Next Story