- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్వాలిఫైయర్ 1లో గెలిచేది వాళ్లే..ఇర్ఫాన్ పఠాన్ సంచలనం !
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ పోరుపై ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ ఫైట్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
55% గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్న ఇర్ఫాన్ పఠాన్, 45% బెంగుళూరుకు ఇచ్చారు. ఈ టోర్నమెంట్ లో రెండు జట్లు కూడా చాలా బలమైనవి... కానీ గుజరాత్ బౌలింగ్ దళం ప్రమాదకరంగా ఉందని వెల్లడించారు. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిస్తే... మొదట బౌలింగ్ తీసుకొని, బెంగళూరును కట్టడి చేసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. అటు బెంగళూరు టాస్ గెలిస్తే.. ఛేజింగ్ కు మొగ్గు చూపుతోందని తెలిపారు. మొత్తానికి ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుందని.. కాస్త అడ్వాంటేజ్ గుజరాత్ కు ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు.






