- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెజెండరీ సింగర్ ఆశా బోస్లేకు IPL నివాళి
ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో జరిగిన MI, RCB మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్లేయర్స్, ప్రేక్షకులు ఆశా భోస్లేకు నివాళి అర్పించారు.

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. వేల సంఖ్యలో అద్భుతమైన పాటలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరించిన లెజెండరీ గాయని, 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' ఆశా భోస్లే (92) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఛాతీ ఇన్ఫెక్షన్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తుదిశ్వాస విడిచారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆమె పాడిన పాటలు ప్రతి భారతీయుడి గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. 'పియా తూ అబ్ తో ఆజా', 'డమ్ మారో డమ్', 'రంగీలా రే' వంటి ఎన్నో టైమ్‌లెస్ హిట్స్ ద్వారా ఆమె తన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని ఏలారు. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో ఆమె అందుకున్న గౌరవం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
ఆశా భోస్లే మరణవార్త తెలుసుకున్న క్రీడా ప్రపంచం, ముఖ్యంగా క్రికెట్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ ప్రారంభానికి ముందు, ఆశా భోస్లేకు ఘన నివాళి అర్పించారు. స్టేడియంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక నిమిషం మౌనం పాటించి ఆమెకు ఘన నివాళులర్పించారు. MI, RCB ఆటగాళ్లు తమ గౌరవసూచకంగా బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి మ్యాచ్ ఆడారు. స్టేడియంలో ఆమె పాడిన మధురమైన గీతాలు ప్లే చేసినపుడు, అక్కడ ఉన్న అభిమానులందరూ భావోద్వేగానికి లోనయ్యారు.
విరాట్ కోహ్లీ, సచిన్ తెండూల్కర్ వంటి క్రికెట్ లెజెండ్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు తమ హృదయపూర్వక నివాళులు అర్పించారు. టాటా ఐపీఎల్ "ఆమె గాత్రం తరతరాలుగా భారతీయ సంస్కృతిని సమృద్ధి చేసింది" అని కొనియాడింది. హిందీతో పాటు తెలుగు, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భాషల్లో వేలాది పాటలను తన అద్భుతమైన గాత్రంతో పలికించిన ఆశా భోస్లే లేని లోటు భారతీయ సంగీత రంగానికి తీరని లోటు.






