ఇకపై ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్..బీసీసీఐ స‌రికొత్త ప్లాన్‌?

by velandi.Saikiran |

ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ ను నిర్వ‌హించేందుకు బీసీసీఐ స‌రికొత్త ప్లాన్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇకపై ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్..బీసీసీఐ స‌రికొత్త ప్లాన్‌?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 చివరి దశకు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి జరగనున్న ఐపీఎల్ ను రెండు భాగాలుగా విభజించి నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట. కేవలం సమ్మర్ లోనే ఐపీఎల్ నిర్వహించడం వల్ల, ప్లేయర్లు వేడిని తట్టుకోవడం లేదని ఓ నివేదికలో తేలిందట. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఇండియాలో ఉన్న వేడిని భరించలేకపోతున్నారట. ఈ మేర‌కు చాలా సార్లు బీసీసీఐకి ఫిర్యాదులు కూడా వ‌చ్చాయ‌ట‌. ప్రస్తుతం ఉన్న 74 మ్యాచ్ ల‌ సంఖ్యను వచ్చే సీజన్ నుంచి 94 కు పెంచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుందట బీసీసీఐ.

ఇవన్నీ వేసవి కాలంలో నిర్వహించడం కష్టమని భావిస్తున్నారట. అందుకే ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించేలా సన్నద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే మొదటి విడత ఐపీఎల్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది. రెండో విడత ఐపీఎల్ ను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య నిర్వహించడంపై ప్లాన్ చేస్తున్నారట. దీనిపై లోతుగా చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోనుంద‌ట బీసీసీఐ. అన్ని ఓకే అయితే, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Next Story