IPL: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌ బై!

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026 సీజన్ ముగియక ముందే క్రికెట్ వర్గాల్లో ఒక ఊహించని సంచలన వార్త గుప్పుమంది.

IPL: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌ బై!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ముగియక ముందే క్రికెట్ వర్గాల్లో ఒక ఊహించని సంచలన వార్త గుప్పుమంది. ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తాను తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక అలసట (Stressed & Exhausted)కు గురయ్యానని, ఇకపై ముంబై ఇండియన్స్ జట్టుతో కొనసాగలేనని ఫ్రాంచైజీ మేనేజ్మెంట్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "నేను ఇక చాలు అనుకుంటున్నాను" (I am done) అని హార్దిక్ ముంబై జట్టు యాజమాన్యానికి తేల్చి చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం NDTV ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ డీల్‌తో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చి. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి హార్దిక్ పాండ్యా నిరంతరం వివాదాలు, విమర్శల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. స్టేడియంలో అభిమానుల నుండి వచ్చిన తీవ్రమైన హూటింగ్స్ (వ్యతిరేకత), సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, మైదానంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం అతనిపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడపలేకపోయాడనే విమర్శలు, అంతర్గత విబేధాల వల్లే హార్దిక్ ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ముంబై ఇండియన్స్‌కు షాక్..

హార్దిక్ పాండ్యా తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు సమాచారం. వచ్చే ఏడాది జరగబోయే మెగా వేలం (Mega Auction) లేదా జట్టు పునర్:నిర్మాణానికి ముందే హార్దిక్ జట్టును వీడాలని అనుకోవడం ముంబై ప్రణాళికలను దెబ్బతీసే అంశం. అయితే, ఈ విషయమై ముంబై ఇండియన్స్ యాజమాన్యం గానీ, హార్దిక్ పాండ్యా గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజా నివేదికల ప్రకారం.. హార్డిక్ కేవలం ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుండే తప్పుకుంటున్నాడా? లేక ఐపీఎల్‌కే కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. తీవ్రమైన పనిభారం (Workload), మెంటల్ స్ట్రెస్ వల్ల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను కాపాడుకునేందుకే ఐపీఎల్ లాంటి హై ప్రెజర్ టోర్నమెంట్ నుండి ప్రస్తుతానికి దూరంగా జరగాలని అతను భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Next Story