వైభ‌వ్ సూర్య‌వంశీకి కొత్త పేరు..ఇక మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లే !

by velandi.Saikiran |

వైభ‌వ్ సూర్య‌వంశీకి కొత్త నామ‌క‌ర‌ణం చేశారు.

వైభ‌వ్ సూర్య‌వంశీకి కొత్త పేరు..ఇక మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లే !
X

దిశ, వెబ్ డెస్క్: 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. నిన్న క్రిస్ గేల్ రికార్డ్ ను కూడా బద్దలు కొట్టాడు వైభవ్. ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు దాదాపు 14 సంవత్సరాలుగా క్రిస్ గేల్ పేరుపైన ఉంది. అయితే ఆ రికార్డును నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా బద్దలు కొట్టి, సరికొత్త రికార్డు సృష్టించాడు వైభవ్. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి కొత్త నామకరణం చేశారు. యూనివర్స్ బేబీ బాస్ గా కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు టీవీ స్క్రీన్ పైన ఈ పేరును ప్రదర్శించారు. బీసీసీఐ ఆదేశాలు మేరకు ఈ నామకరణం చేసినట్లు తెలుస్తోంది. యూనివర్స్ బాస్ గా క్రిస్ గేల్ ఉండగా.. 15 ఏళ్లు ఉన్న వైభవ్ కు యూనివర్స్ బేబీ బాస్ గా పేరు ఫైన‌ల్ చేశారు. కాగా, నిన్న హైద‌రాబాద్ పై 97 ప‌రుగులు చేసి, ఊచ‌కోత కోశాడు వైభ‌వ్. దీంతో ఎస్ఆర్‌హెచ్ పై రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది.

Next Story