- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2026: వెంకటేష్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ‘TVK విజయ్’ స్టైల్లో సెలబ్రేషన్స్! వైరల్
IPL 2026: వెంకటేష్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీ.. ‘TVK విజయ్’ స్టైల్లో సెలబ్రేషన్స్! వైరల్
by Ramesh Naini |
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అదరగొట్టారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్లు అదరగొట్టారు. గాయపడిన రజత్ పటీదార్ స్థానంలో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేష్ అయ్యర్ (40 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ క్రమంలోనే తన అర్ధ శతకం పూర్తయిన తర్వాత.. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ‘మెర్సల్’ సినిమాలో చేసిన ఐకానిక్ పోజ్‌ను వెంకటేష్ రీక్రియేట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 222 స్కోరుతో విశ్వరూపం ప్రదర్శించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Next Story






