IPL 2026: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమైంది. పింక్ సిటీ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడుతున్నాయి.

IPL 2026: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమైంది. పింక్ సిటీ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో ఇది సన్‌రైజర్స్‌కు ఎనిమిదో మ్యాచ్. గత మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో నాలుగింటిలో విజయం సాధించిన సన్‌రైజర్స్, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ పాట్ కమిన్స్ పునరాగమనం జట్టు బౌలింగ్ విభాగానికి కొండంత అండగా నిలిచింది.

సొంత గడ్డపై రాజస్థాన్ సవాల్..

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-3లో కొనసాగుతోంది. రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు, తమ సొంత మైదానంలో ఈ సీజన్‌లో ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశస్వి జైస్వాల్, సంజూ శామ్సన్ వంటి స్టార్ బ్యాటర్లతో రాజస్థాన్ లైనప్ బలంగా కనిపిస్తోంది. జైపూర్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అయితే రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో, ఛేజింగ్ చేసే జట్టుకు ప్రయోజనం ఉంటుందని భావించే కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Next Story