ఆర్సీబీ హెడ్ కోచ్‌కు జరిమానా.. ఎందుకో తెలుసా?

by Harish |

ఆర్సీబీ హెడ్ కోచ్‌కు జరిమానా.. ఎందుకో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్ వేసింది. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఘజన్‌ఫర్ వేసిన 17వ ఓవర్‌లో రెండో బంతిని కృనాల్ పాండ్యా బంతిని గాల్లోకి లేపగా.. నమన్ ధిర్ బాల్‌ను అందుకోవడానికి ప్రయత్నించినా సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ దాటాడు. అప్పటికే బాల్‌ను తిలక్ విసరగా అతను అందుకోలేదు. అప్పుడు తిలక్..ధిర్ బౌండరీ లైన్‌ను తాకిందని భావించి సిక్సర్ సంకేతం ఇచ్చినట్టు కనిపించింది. కానీ, రీప్లేలో ధిర్ బౌండరీ రోప్‌ను తాకలేదని తేలింది. అయితే, కృనాల్ అది సిక్స్‌గా భావించి పరుగు తీయలేదు. దీంతో అసహనానికి గురైన ఫ్లవర్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలోనే ప్రేక్షకులకు, వీక్షకులకు వినిపించేలా ఫ్లవర్ అసభ్యకరమైన పదజాలాన్ని వాడినట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం.. అతనిపై చర్యలు తీసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచిని విషయం తెలిసిందే. ఈ ఓటమితో ముంబై జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.


Next Story