IPL 2026: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్, పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఈ 40వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL 2026: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్, పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఈ 40వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో పంజాబ్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరింట్లో విజయం సాధించి, 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. మరోవైపు.. రాజస్థాన్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో విజయం సాధించగా, మూడింట్లో ఓడిపోయింది. 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్, ఈ మ్యాచ్‌లో గెలిచి తన ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.

గత చరిత్రను పరిశీలిస్తే..

ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. గత చరిత్రను పరిశీలిస్తే, ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 30 సార్లు తలపడగా, రాజస్థాన్ 17 సార్లు, పంజాబ్ 12 సార్లు విజయం సాధించాయి, ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అజేయంగా ఉన్న పంజాబ్‌ను రాజస్థాన్ ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story