- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: చెన్నైతో రాజస్థాన్ రాయల్స్ ఢీ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రియాన్ పరాగ్
ఐపీఎల్-2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-19 సీజన్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తుండగా, చెన్నై జట్టును రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తున్నారు. చాలాకాలం పాటు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన సంజూ శామ్సన్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా వేర్వేరు జట్ల నుంచి బరిలోకి దిగుతుండటం విశేషం. ఇక గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. అయితే మంచు ప్రభావం (Dew factor) ఉంటుందనే ఉద్దేశంతో రాజస్థాన్ ఛేజింగ్‌కే మొగ్గు చూపింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
రుతురాజ్ గైక్వాడ్ (C), సంజూ శామ్సన్ (WK), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్, జేమీ ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.
రాజస్థాన్ రాయల్స్ (RR):
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ (C), ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే.






