- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్. బ్యాటింగ్‌కు సిద్ధమైన శుభ్‌మన్ గిల్ జట్టు. బట్లర్, రషీద్, స్టోయినిస్ వంటి స్టార్లతో ఇరు జట్లు హోరాహోరీకి రెడీ!

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా నాలుగో మ్యాచ్ పంజాబ్, గుజరాత్ జట్ల మధ్య జరుగుతుంది. చంఢీఘర్ వేదికగా జరుగుతున్న ఈ నాలుగో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. గత సీజన్లో ఫైనల్ వరకు చేరుకొని రన్నరప్గా నిలిచిన పంజాబ్ జట్టు గుజరాత్ పై ఎలాంటి ఫామ్ కనబరుస్తుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే పంజాబ్ జట్టుపై గెలిచి తమ సత్తా చాటాలని గిల్ సేనా రెడీగా ఉంది.
శ్రేయస్ అయ్యర్: ఛేజింగ్ చేయడం వల్ల లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఉంటుందని, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కూడా తమ జట్టు ఛేజింగ్‌లో మెరుగ్గా రాణించిందని టాస్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు. గత సీజన్ విజయాలను పక్కనబెట్టి, వర్తమానంలో ఉంటూ ప్రతి బంతినీ కీలకంగా భావించాలని తన జట్టుకు సందేశమిచ్చారు. టీ20 ఫార్మాట్‌లో భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా, మైదానంలో తమ సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించాలని ఆటగాళ్లకు సూచించారు. ఈ మ్యాచ్ కోసం కూపర్, స్టోయినిస్, బార్ట్‌లెట్, మార్కో జాన్సెన్‌లతో తమ జట్టు బరిలోకి దిగుతున్నట్లు అయ్యర్ వెల్లడించారు.
శుభ్‌మాన్ గిల్: టాస్ ఓడిన తర్వాత మొదట బ్యాటింగ్ చేయడంపై గిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా వర్షం కురుస్తున్నప్పటికీ, వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో గ్లెన్, అశోక్ శర్మ వంటి కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించామని, జట్టులో రషీద్ ఖాన్, రబాడా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా వెటరన్ ప్లేయర్ జోస్ బట్లర్ అనుభవం తమ జట్టుకు ఈ ఏడాది పెద్ద ప్లస్ అవుతుందని గిల్ ధీమా వ్యక్తం చేశారు. గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా అద్భుత ప్రదర్శన చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఎం షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్






