- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్నోతో కీలక మ్యాచ్.. ఇవాళ ఓడితే పంజాబ్ ఇంటికే
లక్నోతో కీలక మ్యాచ్ జరుగనుంది. ఇందులో ఓడితే పంజాబ్ ఇంటి దారి పట్టనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక ఫైట్ జరగనుంది. ఏకనా స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు చాలా కీలకం. ఇందులో గనక ఓడిపోతే, పంజాబ్ ఇంటి దారి పట్టాల్సిందే. 13 పాయింట్లు సాధించిన పంజాబ్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే ఇవాళ లక్నో పైన గెలిస్తే 15 పాయింట్ల నాలుగో స్థానానికి చేరుతుంది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడే ప్లే ఆఫ్స్ కు పంజాబ్ దూసుకు వెళ్తుంది. ఇదంతా జరగాలంటే, ఇవాళ కచ్చితంగా పంజాబ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. టోర్నమెంట్ ప్రారంభంలో వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత ఆరు ఓడిపోయింది. ఇప్పుడు మరో జట్టు గెలుపోటములపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. అటు లక్నో ఇప్పటికే ఎలిమినేట్ కాగా, పరువు కోసం నేడు బరిలోకి దిగుతోంది.






