- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: సెంచరీతో చెలరేగిన రాహుల్.. భారీ స్కోరు దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి రాహుల్ తన బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన రాహుల్, పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 6 భారీ సిక్సర్లు, 12 ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించారు. ముఖ్యంగా కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పంజాబ్ పేసర్లను ఉతికి ఆరేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి రాహుల్ 50 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచి క్రీజులో ఉన్నారు.
తోడైన నితీశ్ రాణా మెరుపులు..
రాహుల్‌కు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా కూడా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 36 బంతులు ఎదుర్కొన్న రాణా.. 2 సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరి జోడి రెండో వికెట్‌కు అజేయంగా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. నిర్ణీత 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 190 పరుగుల మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం క్రీజులో ఉన్న వీరిద్దరి జోరు చూస్తుంటే ఢిల్లీ జట్టు 250 పరుగుల భారీ స్కోరును నమోదు చేసేలా కనిపిస్తోంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీసినా, భారీగా పరుగులు సమర్పించుకున్నారు.






