IPL 2026: లక్నోపై టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

by Ramesh Naini |

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నోని ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం’ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

IPL 2026: లక్నోపై టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నోని ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం’ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. భారీ స్కోరు సాధించి గుజరాత్‌పై ఒత్తిడి పెంచాలని లఖ్‌నవూ భావిస్తుండగా.. వారిని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది.

మార్పుల్లేకుండా బరిలోకి ఇరు జట్లు

గత మ్యాచ్‌ల్లో ఆడిన తుది జట్లతోనే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్లు ఇరువురు కెప్టెన్లు టాస్ సందర్భంగా వెల్లడించారు. మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్ కెప్టెన్) మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లకుండా ముందే ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలాంటి సుదీర్ఘ టోర్నీల్లో నిలకడ (Consistency) చాలా ముఖ్యం. ఏ జట్టు అయితే అత్యంత స్థిరంగా రాణిస్తుందో, ఆ జట్టే టోర్నీ గెలుస్తుంది’ అని తెలిపారు. రిషభ్ పంత్ (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్) మాట్లాడుతూ.. ‘పిచ్ స్వభావాన్ని బట్టి మొదట బ్యాటింగ్, బౌలింగ్ అనే దానితో పెద్దగా తేడా ఉండదని నా అభిప్రాయం. గత మ్యాచ్‌లో ఆటగాళ్ల పోరాట పటిమ, ముఖ్యంగా ఫీల్డింగ్ అద్భుతం. గతాన్ని వదిలేసి ఈ మ్యాచ్‌పైనే పూర్తి దృష్టి పెట్టాం.’ అని తెలిపారు.

తుది జట్లు ఇవే..

గుజరాత్ టైటాన్స్ (GT): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంపాక్ట్ ప్లేయర్లు: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖెజ్రోలియా, అనుజ్ రావత్.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG): మిచెల్ మార్ష్, ఐదెన్ మార్‌క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమి, అవేశ్‌ ఖాన్, దిగ్వేశ్‌ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

ఇంపాక్ట్ ప్లేయర్లు: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్క్జ్‌, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్.

నేడు డబుల్ ధమాకా

ఈ రోజు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూ, గుజరాత్ తలపడుతుండగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో పోరులో ముంబయి ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Next Story