- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు భారీ ఊరట లభించనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు భారీ ఊరట లభించనుంది. ఏప్రిల్ 29న వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న కీలక పోరులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కండరాల గాయానికి (Hamstring Injury) గురయ్యారు. ఈ కారణంగా ఆయన గత మూడు మ్యాచ్‌లకు (పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్) దూరమయ్యారు. రోహిత్ లేకపోవడంతో ముంబై బ్యాటింగ్ లైనప్ తీవ్రంగా తడబడింది. అయితే, ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని, పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని జట్టు వర్గాలు వెల్లడించాయి.
ముంబైకి చావోరేవో..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించిన ముంబై, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌లలో దాదాపు అన్నింటిలోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కీలక సమయంలో రోహిత్ శర్మ పునరాగమనం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అభిమానులు భావిస్తున్నారు. రోహిత్ శర్మ రాకతో ముంబై మళ్లీ విజయాల బాట పడుతుందో లేదో చూడాలి. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 137 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నారు.






