IPL 2026: ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ విలవిల: పీకల్లోతు కష్టాల్లో క్యాపిటల్స్

by Gantepaka Srikanth |

అరుణ్ జైట్లీ మైదానం వేదికగా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు శివతాండవం చేస్తున్నారు.

IPL 2026: ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ విలవిల: పీకల్లోతు కష్టాల్లో క్యాపిటల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ జైట్లీ మైదానం వేదికగా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు శివతాండవం చేస్తున్నారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున ఆడుతున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆయన ఇప్పటివరకు మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి ఢిల్లీ వెన్నువిరిచాడు. భువీ బౌలింగ్‌లో స్వింగ్ అర్థం కాక ఢిల్లీ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ కూడా వికెట్ల వేటలో వెనుకబడలేదు. తనదైన లైన్ అండ్ లెంగ్త్‌తో ఢిల్లీ మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హేజల్‌వుడ్ కూడా 3 వికెట్లు తీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ జట్టులో సగం కంటే ఎక్కువ మంది అప్పుడే పెవిలియన్‌కు చేరుకున్నారు.

స్కోరు అప్‌డేట్..

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం కనీసం గౌరవప్రదమైన స్కోరు సాధించడానికి పోరాడుతోంది. ఆర్సీబీ బౌలర్లు ఇదే ఊపును కొనసాగిస్తే ఢిల్లీ జట్టు తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సొంత గడ్డపై బెంగళూరు అభిమానులు ఆర్సీబీ బౌలర్ల ప్రదర్శనకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 11 పరుగులు చేసింది. క్రీజులో డెవిడ్ మిల్లర్, అభిషేక్ ఉన్నారు.

Next Story