IPL 2026: తప్పు ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా.. షాకిచ్చిన బీసీసీఐ

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది.

IPL 2026: తప్పు ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా.. షాకిచ్చిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించినందుకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు, అతనికి ఒక డెమెరిట్ పాయింట్ను (Demerit Point) కేటాయించారు. వివరాల్లోకి వెళితే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతి సమయంలో.. హార్దిక్ పాండ్యా తన రన్-అప్కు వెనుకకు నడుచుకుంటూ వెళ్తూ, తీవ్ర అసహనంతో వికెట్లపై ఉన్న బెయిల్సు న్ను (Bails) గట్టిగా కిందకు కొట్టాడు. ఈ ప్రవర్తన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని లెవెల్-1 పరిధిలోకి వచ్చే ఆర్టికల్ 2.2 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా తేలింది. ఈ ఆర్టికల్ ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ కిట్, దుస్తులు, మైదానంలోని పరికరాలు లేదా వికెట్లు వంటి వాటిని దుర్వినియోగం చేయడం లేదా వాటిపై అసహనం ప్రదర్శించడం నిషేధం.

తప్పు ఒప్పుకున్న పాండ్యా..

మ్యాచ్ అనంతరం ఈ ఉల్లంఘనకు సంబంధించి మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన ఈ జరిమానాను మరియు శిక్షను హార్దిక్ పాండ్యా అంగీకరించాడు. లెవెల్-1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయమే తురా ఆమైనది కావడం వల్ల ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ జరిమానా ఖరారైంది. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించగా, ఈ మ్యాచ్ కూడా కోల్‌కతా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్లో అటు కెప్టెన్గా, ఇటు ఆటగాడిగా హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ జరిమానా రూపంలో అతనికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Next Story