రెచ్చిపోయిన హైదరాబాద్ బ్యాటర్స్... పంజాబ్ ముందు భారీ టార్గెట్

by Muthe.Rajitha |

ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు పరుగుల వరద పారింది.

రెచ్చిపోయిన హైదరాబాద్ బ్యాటర్స్... పంజాబ్ ముందు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు పరుగుల వరద పారింది. హైదరాబాద్ సన్ రైజర్స్(SRH), పంజాబ్ కింగ్స్ ఎలెవన్(PBKS) మధ్య జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ బౌలర్లకు ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్స్ చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసారు. అభిషేక్ (35), ఇషాన్ కిషన్(55), ట్రావిస్ హెడ్(38), క్లాసేన్(69), నితీష్ కుమార్(29) బౌండరీల మోత మోగించారు. అర్ష్ దీప్, ఫెర్గుసన్, చాహల్, వైశాఖ్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా 236 పరుగుల భారీ లక్ష్యంతో పంజాబ్ కాసేపట్లో బరిలోకి దిగనుంది.

Next Story