IPL : అభిషేక్ శర్మ దూకుడుతో హైదరాబాద్ శుభారంభం.. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

by Ramesh Naini |   (  Updated:2026-04-11 10:44:55  IST  )

ఐపీఎల్‌లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య సమరం ప్రారంభమైంది.

IPL : అభిషేక్ శర్మ దూకుడుతో హైదరాబాద్ శుభారంభం.. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్‌లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య సమరం ప్రారంభమైంది. టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది.

రెచ్చిపోయిన అభిషేక్ శర్మ..

హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులోకి రాగా, పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్ ఎటాక్ మొదలుపెట్టాడు. మొదటి బంతినే వైడ్‌గా వేసిన అర్ష్‌దీప్‌.. ఆ తర్వాతి బంతికే అభిషేక్ చేతిలో బౌండరీ సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో 9 పరుగులు రాగా.. జేవియర్ బార్ట్‌లెట్ వేసిన రెండో ఓవర్‌లో అభిషేక్ మరింత అటాకింగ్‌కు దిగి రెండు బౌండరీలు రాబట్టాడు. దీంతో ఐదు ఓవర్లుకు హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. ప్రస్తుతం అభిషేక్ శర్మ (59), ట్రావిస్ హెడ్ (18) క్రీజులో ఉన్నారు. 18 బంతుల్లో అభిషేక్ శర్మ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

కెప్టెన్‌ల వ్యూహాలు, పిచ్ రిపోర్ట్..

టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగే ఎంచుకునే వాళ్లమని సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. తమ జట్టులో అద్భుతమైన యువ బౌలర్లు ఉన్నారని, ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు. మరోవైపు ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమేనని మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ విశ్లేషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టు 170+ పరుగులకే పరిమితం కావచ్చని, మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా వేశాడు. ఇదిలా ఉండగా.. ‘టోర్నీలో ఇప్పుడిప్పుడే జోష్‌ వస్తోంది, మున్ముందు మంచి ఆటతీరు ప్రదర్శిస్తా’ అని సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మ్యాచ్‌కు ముందు ఆశాభావం వ్యక్తం చేశాడు.

రికార్డుల్లో సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం..

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 24 సార్లు తలపడగా, అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. పంజాబ్ జట్టు కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.

ముల్లాన్‌పూర్‌లో సిక్సర్ల సునామీ.. పవర్ ప్లేలోనే 100 దాటేసిన SRH

Next Story