IPL 2026: ముల్లాన్‌పూర్‌లో సిక్సర్ల సునామీ.. పవర్ ప్లేలోనే 100 దాటేసిన SRH

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-11 10:44:14  IST  )

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు.

IPL 2026: ముల్లాన్‌పూర్‌లో సిక్సర్ల సునామీ.. పవర్ ప్లేలోనే 100 దాటేసిన SRH
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. పంజాబ్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఉతికేస్తూ కేవలం 6 ఓవర్లలోనే (పవర్ ప్లే) జట్టు స్కోరును 100 మార్కును దాటించి రికార్డు నెలకొల్పారు. ముఖ్యంగా పంజాబ్ బౌలర్లపై అభిషేక్ శర్మ వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఆడుతూ 14 బంతుల్లోనే 30 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) సాధించి పవర్ ప్లే స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో 100కు పైగా పరుగులు చేసిన అతికొద్ది జట్ల జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్ మరోసారి చేరింది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా గ్రౌండ్ నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 106 పరుగులు చేశారు.

అభిషేక్ శర్మ దూకుడుతో హైదరాబాద్ శుభారంభం.. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

Next Story