- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pat Cummins : ప్యాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల బంపర్ ఆఫర్
హైదరాబాద్ సన్‌రైజర్స్(SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ను ఓ భారీ డీల్ వరించినట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సన్‌రైజర్స్(SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ను ఓ భారీ డీల్ వరించినట్టు సమాచారం. కమిన్స్ తమ దేశం తరఫునే పూర్తిస్థాయిలో కొనసాగించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) భారీ ఆఫర్ ప్రతిపాదించింది. అంతర్జాతీయ టీ20 లీగ్‌ల నుండి వస్తున్న భారీ ఆఫర్ల నేపథ్యంలో.. కమిన్స్‌కు మూడేళ్ల కాలానికి సుమారు 12 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.113 కోట్ల మెగా డీల్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం కమిన్స్ రాబోయే మూడేళ్లపాటు ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడేందుకు బాండ్ రాసివ్వాల్సి ఉంటుంది. ఈ పరిణామం వెనుక ఐపీఎల్(IPL) ఫ్రాంచైజీల నుండి వస్తున్న తీవ్రమైన పోటీ ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల ఒక ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా తాము నిర్వహించే వివిధ లీగ్‌లలో ఆడేందుకు కమిన్స్‌కు సుమారు 6.6 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.62 కోట్ల మెగా ఆఫర్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి.
ఒకవేళ కమిన్స్ ఈ ప్రైవేట్ డీల్‌కు మొగ్గు చూపితే, అతను ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం కష్టమవుతుందనే ఆందోళనతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ స్థాయిలో స్పందించింది. లీగ్ క్రికెట్ కంటే జాతీయ జట్టుకే ప్రాధాన్యత ఇచ్చేలా ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహం అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే, ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ప్యాట్ కమిన్స్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.






