- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోండా కార్లపై డిస్కౌంట్లు..రూ.1.97 లక్షల వరకు భారీ తగ్గింపు
హోండా కార్లపై ( Honda Cars ) తాజాగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ.

దిశ, వెబ్ డెస్క్: కార్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు బిగ్ అలర్ట్. హోండా కార్లపై ( Honda Cars ) తాజాగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. హోండా అమేజ్, ఎలివేట్, హోండా సిటీ లాంటి కార్లపై ఈ డిస్కౌంట్ ఉండనుంది. హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ కారు ధర ఎక్స్ షోరూం ప్రకారం రూ .7.51 లక్షల నుంచి పది లక్షల వరకు ఉంది. అయితే ఈ కారుపై దాదాపు రూ.68,000 డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. హోండా ఎలివేట్ కారుపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది.
హోండా కార్లపై భారీ డిస్కౌంట్
ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.11.59 లక్షల నుంచి రూ.16.76 లక్షల మధ్య ఉంది. ఇందులో బేస్, టాప్ ఎండ్ మోడల్స్ ఉంటాయి. అటు హోండా సిటీ కారుపైన రూ.1.56 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఎక్స్ షోరూం ప్రకారం ఈ కారు ధర 12 లక్షల నుంచి 14 లక్షల మధ్య ఉంది. అటు హోండా సిటీ e:HEV కారు పైన రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర దాదాపు 20 లక్షల వరకు ఉంది. ఈ ఆఫర్లు ఈ ఏప్రిల్ మాసం వరకు మాత్రమే ఉంటాయని కంపెనీ వెల్లడించింది.






