పంజాబ్‌కు షాక్.. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన డేంజ‌ర్ బ్యాట‌ర్ !

by velandi.Saikiran |

పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కానల్లీ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

పంజాబ్‌కు షాక్.. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన డేంజ‌ర్ బ్యాట‌ర్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ లో ఓటమి లేకుండా ముందుకు దూసుకు వెళ్తున్న పంజాబ్ కింగ్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ లో సూపర్ బ్యాటింగ్ లైనప్ తో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ ఆటగాడు కూపర్ కానల్లీ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ మధ్యలోనే పంజాబ్ జట్టును వీడి, స్వదేశానికి వెళ్ళినట్లు హింట్ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టాడని ప్రచారం జోరందుకుంది.

తాజాగా పెర్త్ బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో కూపర్, పోస్ట్ చేయడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు పంజాబీ కింగ్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 223 పరుగులు సాధించిన కూపర్ కానల్లీ... 163.97 స్ట్రైక్ రేటుతో ఇరగదీసాడు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి, పాయింట్స్ టేబుల్ లో అగ్ర‌స్థానంలో పంజాబ్ కింగ్స్ కొన‌సాగుతోంది.

Next Story