వివాదంలో హార్ధిక్‌ పాండ్యా...ముంబై జెర్సీ కింద వేసి మ‌రీ !

by velandi.Saikiran |

వివాదంలో హార్ధిక్‌ పాండ్యా చిక్కుకున్నాడు. ముంబై జెర్సీ విడిచి కింద వేసిన వీడియో వైర‌ల్ గా మారింది.

వివాదంలో హార్ధిక్‌ పాండ్యా...ముంబై జెర్సీ కింద వేసి మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా ముంబై ఇండియన్స్ విఫలమైనందుకుగాను హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదని సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సారి ముంబై ఇండియన్స్ తొందరగా ఎలిమినేట్ కావడానికి హార్దిక్ పాండ్యా వైఫల్యమే అంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు. అయితే ఇది ముందుగానే, గమనించిన హార్దిక్ పాండ్యా ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో డీలింగ్ కుదుర్చుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ముంబై జెర్సీ వద్దంటున్న హార్దిక్ పాండ్యా ?

ఐపీఎల్ 2026 లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ తో చివరి మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర నిలబడ్డ హార్దిక్ పాండ్యాను చూసిన ముంబై అభిమానులు, గట్టిగా అరిచారు. ఇక వాళ్ల‌ ఉత్సాహం గమనించిన హార్దిక్ పాండ్యా వెంటనే.. ముంబై ఇండియన్స్ జెర్సీని విడిచి, అక్కడే అభిమానుల పైన విసిరేశాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ తో ఇక పని అయిపోయిందని.. అందుకే అలా జెర్సీని విడిచి, అభిమానులపై విసిరాడని అంటున్నారు. వచ్చే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా హార్దిక్ పాండ్యా హింట్ ఇస్తూ.. ఇలా చేసి ఉంటాడని రియాక్ట్ అవుతున్నారు అభిమానులు. క్లిక్

Next Story